కార్మికుల మృతిపై కలెక్టర్ సీరియస్

TPT: జిల్లాలోని మంగళం ఏరియాలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు మృతిచెందిన విషయ తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. మూడు అంతస్తుల వరకు అనుమతి ఉండగా, ఐదంతస్తుల భవనం ఎలా కట్టారని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు.