జాతీయ కుటుంబ ప్రయోజన పథకం.. దరఖాస్తుల ఆహ్వానం'

NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు రూ. 20 వేల ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని చిట్యాల మండలం పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతమ్ తెలిపారు. 18 నుండి 59 సం.ల మధ్య వయసు ఉండి 2023 తరువాత కుటుంబ పెద్ద మరణించినట్లయితే సంబంధిత ధ్రువపత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.