'పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందదాయకం'

RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంతాపూర్‌లో శుక్రవారం ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమన్నారు.