మెట్‌పల్లిలో బాలికల ర్యాలీ
JGL: ఈనెల 24న మెట్‌పల్లి మినీ స్టేడియంలో జరిగే మొదటి అస్మిత లీగ్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని కోరుతూ బాలికలు మెట్‌పల్లి పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గ్రామీణ బాలికలను క్రీడాకారులుగా తయారు చేయడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమన్నారు.