మహిళా భద్రతపై 'శక్తి యాప్' అవగాహన
ATP: నార్పల, బుక్కరాయసముద్రం మండలాల్లో మహిళా భద్రత, 'శక్తి యాప్' పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు, శక్తి బృందాలు మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం గురించి వివరించారు. ఆపద సమయాల్లో డయల్ 100/112 లేదా చైల్డ్ లైన్ 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలని సూచించారు.