ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా
AP: రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమాను అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు.