VIDEO: వరద ఉధృతికి నీట మునిగిన బ్రిడ్జి

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో గోదావరి వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ముక్తేశ్వరంలో ఉన్న తొగరపాయ వంతెన పూర్తిగా నీట మునగడంతో లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున లంక ప్రాంతాలలో ఉన్న పశువులు ఒడ్డుకు చేర్చాలని అధికారులు చెప్తున్నారు.