VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
SRD: ఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ముజాహిద్ చిస్తి, సభ్యుల నిర్వహణలో రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. రక్తమిచ్చిన వారికి ఖేడ్ అసెంబ్లీ షేర్ బోస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ రాము, బంగార్రాజు ప్రశంస పత్రాలు అందజేశారు. రక్తదాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.