ఎమ్మెల్యేను కలిసిన మండల పార్టీ అధ్యక్షులు
VZM: కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కోళ్ల శ్రీను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని బుధవారం ఎల్.కోటలోని పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీలో నిబద్ధత పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.