VIDEO: అంగన్వాడీ కేంద్రాలో పేరెంట్స్‌కు వంటల పోటీలు
NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో పోషకాహార మాసోత్సవాలు, పేరెంట్స్‌కు వంటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా, తండ్రులతో వంటల పోటీలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులతో పౌష్టికాహారం వాడకంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులు, కిశోర బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.