VIDEO: బస్సు ఆపడం లేదని ఫిర్యాదు.. పరిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: బస్సు ఆపడం లేదని ఫిర్యాదు.. పరిష్కరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు మండలం పెద్దచెరువు తండాకు చెందిన ప్రజలు తమ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. బుధవారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద చెరువు తండాకు వెళ్లిన క్రమంలో ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వెంటనే ఫోన్ ద్వారా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే సమస్య పరిష్కరించారు.