రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సలహాలు సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రణాళికాబద్ధంగా పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందని తెలిపారు.