VIDEO: 'హోంగార్డుల సేవలు అభినందనీయం'
అన్నమయ్య: రాయచోటిలో శనివారం జరిగిన హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో SP ధీరజ్ పాల్గొన్నారు. పోలీసులతో సమానంగా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల సేవలను ప్రశంసించారు. కమ్యూనిటీ పోలీసింగ్, నేర దర్యాప్తు, అత్యవసర పరిస్థితుల్లో వారి కీలక భూమికను కొనియాడారు. హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, సమస్యలను పరిష్కరిస్తామన్నారు.