యాక్సిడెంట్లో ఆరిలోవ యువకుడి మృతి

VSP: ఆరిలోవ ప్రాంతానికి చెందిన యువకుడు బైక్‌పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి జస్వంత్ మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జస్వంత్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో జస్వంత్‌ను కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.