చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా
VZM: చెక్కు బౌన్స్ కేసులో అంబటివలసకు చెందిన పాలూరి అప్పల నరసింహనాయుడుకు రెండు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 9 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ తీర్పు చెప్పారు. నాలుగున్నర లక్షల చెక్కును పాలూరి గొట్లాం గ్రామానికి చెందిన సెడగం నాగరాజుకు ఇచ్చాడు. చెక్కు బౌన్స్ కావడంతో నాగరాజు ఫిర్యాదు చేశారు.