అమరజీవికి చంద్రబాబు, జగన్ నివాళులు
AP: పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా CM చంద్రబాబు, మాజీ CM జగన్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి లక్ష్యం సాధించిన శ్రీరాములు మహనీయుడని, ప్రాణాలనూ లెక్కచేయని ఆయన త్యాగం అందరిలో స్ఫూర్తి నింపాలంటూ CBN ట్వీట్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడని జగన్ పేర్కొన్నారు.