అంగన్వాడీ భవనాల నిర్మాణానికి భూమి పూజ

MNCL: జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు అధికారులు భూమి పూజ చేశారు. శుక్రవారం నిర్వహించిన పనుల జాతర సందర్భంగా వారు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ, ఐసీడీఎస్ సీడీపీవో రేష్మ, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ పాల్గొన్నారు.