VIDEO: మత్స్యగుండంలో వైభవంగా మహాశివరాత్రి
ASR: హుకుంపేట మండలం మత్స్యగుండం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పోటెత్తి, మత్స్యలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎస్సై దుర్గప్రసాద్ క్షేత్రంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.