రోడ్ల ఆక్రమణలు.. నరకప్రాయం!
SRPT: సూర్యాపేట పూల సెంటర్, అలంకార్ రోడ్డులో ఆక్రమణలు అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఫుట్‌పాత్‌లు దాటి దుకాణాలు రోడ్డు మధ్యలోకి రావడంతో వాహనదారులు, పాదచారులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎండలో చెమటోడ్చి క్లియర్ చేస్తున్నా, మున్సిపల్ అధికారులు 'ఏసీ' గదులకే పరిమితం కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. తక్షణమే ఆక్రమణలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.