'కార్యకర్తలకు పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుంది'
కృష్ణా: పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ పార్టీ ఎల్లపుడు అండగా, భరోసాగా ఉంటుందని AMC ఛైర్మన్ కొండా ప్రవీణ్ అన్నారు. సాయిపురం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు గోరిపర్తి నాగేశ్వరరావు ప్రమాదవశాత్తు గాయపడగా, సోమవారం టీడీపీ నాయకులు పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, విశ్రాంతి తీసుకుని ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.