నవోదయ పరీక్షకు 3,899 మంది హాజరు
ATP: లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అందులో మొత్తం 6,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,899 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు.