'ప్రజావాణి'లో 288 అర్జీల స్వీకరణ
KNR: 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 288 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, కర్రీ పాల్గొన్నారు