'లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం'
కృష్ణా: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. మంగళవారం మోపిదేవి మండలం నాగాయతిప్పలో ఆమె పర్యటించారు. రైతన్నా మీ కోసం కరపత్రాలు పంచిపెట్టి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలతో రైతులకు కలిగే మేలు వివరించారు. బజ్జి మిర్చి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.