VIDEO: పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO
MDK: వెల్దుర్తి మండల వ్యాప్తంగా శనివారం నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాధికారి బుచ్చ నాయక్ తెలిపారు. మండల పరిధిలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 405 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.