మంత్రాలయంలో ఎటు చూసినా జనమే

KRNL: తుంగభద్ర నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రాలయం ఎటు చూసినా భక్త జనసంద్రంగా మారింది. స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివచ్చారు. మధ్వ కారిడార్, రాఘవేంద్ర కూడలి, నదీ తీర ప్రాంతాలు భక్తులతో కోలాహలంగా మారాయి. మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు నేతృత్వంలో తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.