రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి పార్థసారథి

AP: అకాల వర్షాలకు ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి భరోసా కల్పించారు. 'రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది' అని పార్థసారథి పేర్కొన్నారు.