భారీ వర్షానికి కొట్టుకుపోయిన కల్వర్టు, రోడ్డు

ADB: గాదిగూడ మండలం చిత్తగూడ, బొడ్డిగూడ గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు, రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. రోజూ పదుల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.