సెమిస్టర్ పరీక్షలు వాయిదా

సెమిస్టర్ పరీక్షలు వాయిదా

SKLM: ఎచ్చెర్లలోని డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. పరిపాలన సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ భాస్కర్ తెలిపారు. మంగళవారం కళాశాలలు, కేంద్రాలకు ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 2 వరకు జరగాల్సిన పరీక్షలకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.