లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం: DCJ
KRNL: జాతీయ లోక్అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం వచ్చిందన్నారు.