వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ATP: జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించిన ఆయన, వడదెబ్బ మరణాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ సరఫరా చేయాలన్నారు.