సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

BHNG: ఆలేరు పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. సాయి గూడెం గ్రామానికి చెందిన ముదపాక దానమ్మ–నరసయ్య, ఎండి మక్బుల్ గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ వస్పర్ శంకరయ్య వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.