పీఓ దృష్టికి బోథ్ నియోజకవర్గ సమస్యలు

పీఓ దృష్టికి బోథ్ నియోజకవర్గ సమస్యలు

ADB: ఉట్నూర్ ఐటీడీఏ ఇంఛార్జ్ పీఓ యువరాజ్ మర్మట్‌ను మంగళవారం బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ కలిశారు. బోథ్ మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉండే విధంగా, రఘునాథ్ పూర్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయుడి నియమించాలని కోరారు. చలి తీవ్రత దృశ్య ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో వాటర్ హీటర్లు ఉండేలా చూడాలని కోరారు.