ఆడబిడ్డ పుడితే రూ.లక్ష: సీఎం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పుదుచ్చేరి సీఎం రంగసామి కీలక హామీ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వస్తే.. ఆడబిడ్డ పుడితే ప్రస్తుతం ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.50వేల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రూ.లక్షకు పెంచుతామని వెల్లడించారు. అలాగే మత్స్యకారుల చిరకాల డిమాండ్‌కు అనుగుణంగా వారిని అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.