VIDEO: మహాశివరాత్రికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ
కోనసీమ: మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. శనివారం ఉదయం ఆయన కాట్రేనికోన మండలం కుండళేశ్వరం క్షేత్రాన్ని సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులకు సూచనలు చేశారు.