జీపు బోల్తా.. తప్పిన ప్రమాదం.!

జీపు బోల్తా.. తప్పిన ప్రమాదం.!

NDL: జిల్లాలోని పాణ్యం మండలం సుగాలి మెట్ట సమీపంలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలోకి అదుపుతప్పిన మహేంద్ర థార్ జీప్ బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.