విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో నీటి కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులు శశి(12), దీపన్(10)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.