VIDEO: కేతకిలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు
SRD: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శివ క్షేత్రం ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కితకి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించేందుకు ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. స్థానిక అమృతగుండంలో స్నానమాచరించి క్యూలైన్‌లో దర్శనానికి వెళ్తున్నారు. అనంతరం స్థానిక ఆవరణలోని చెట్టు కింద దీపారాధన చేస్తున్నారు.