మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

కడప నగరపాలక సంస్థ(కేఎంసీ) ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీల పాలక మండలి గడువు ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఈ సందర్భంగా కమిషనర్ రాకేష్ చంద్రం సహా అధికారులు ఆయనను అభినందించారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులపై కమిషనర్ వివరాలు అందించారు.