బాన్సువాడ నుంచి వేములవాడకు బస్సు సర్వీస్

KMR: బాన్సువాడ నుంచి కామారెడ్డి మీదుగా వేములవాడకు బస్సును ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. బాన్సువాడ బస్టాండ్ నుంచి ఉదయం 8:20 గంటలకు బయలుదేరి 11:20 గంటలకు వేములవాడ చేరుకుంటుందన్నారు. తిరిగి వేములవాడ నుంచి 11:40 గంటలకు బయలుదేరి బాన్సువాడకు సాయంత్రం 6:10 నిమిషాలకు చేరుకుంటుందని వివరించారు.