VIDEO: కొందండ రామయ్యకు స్నపన తిరుమంజనం
KDP: ఒంటిమిట్ట కోదండ రామస్వామికి శనివారం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా టీటీడీ అధికారులు తెచ్చిన నూతన పట్టు వస్త్రాలు, పండ్లు, పుష్పాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. గర్భాలయంలోని సీతారామలక్ష్మణులను సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.