రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
E.G: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారిపై వెళ్తున్న స్కూటీని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాంధీనగరం గ్రామానికి చెందిన ఆచంట జగన్నాథరావు అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి దేవరపల్లి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.