అధికారంలోకి వస్తే వారి ఇళ్లల్లోకి దూరి చంపేస్తాం: దీదీ మేనల్లుడు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాపై దాడులు చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యానించడంపై అభిషేక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి, రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాక్‌లోని ఇళ్లల్లోకి వెళ్లి దాడులు చేస్తామని హెచ్చరించారు.