అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి: సీఐ

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి: సీఐ

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు గ్రామంలో సిఐ శ్రీనివాసరావు స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేర నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యవసాయ పనిముట్లు దొంగతనాలు జరుగుతున్నాయని తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. అన్ని వేళలా పోలీసులు గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు.