నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

MBNR: మూసాపేట మండలంలోని కొమ్మిరెడ్డిపల్లిలో గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. అడ్డాకుల, మూసాపేట మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయనున్నారు.