రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం..!
SRD: ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. యూటర్న్ తీసుకుంటున్న ఎలక్ట్రికల్ బస్సును సంగారెడ్డి డిపో బస్సు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.