చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

NLR: ఇందుకూరుపేట మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గంగపట్నం ఎస్సీ కాలనీకి చెందిన ఏలూరు వెంకటరమణయ్య చేపల వేట కోసం సమీపంలోని ఉప్పుటేరుకు వెళ్లాడు. అక్కడ వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే వెంకటరమణయ్య ప్రాణాలు కోల్పోయినట్లు వారు వెల్లడించారు.