అన్నా క్యాంటీన్లో భోజనం వడ్డించిన ఎమ్మెల్యే
CTR: సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సోమవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పట్టణంలోని దేశమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. నగరి బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనాలు వడ్డించారు.