నేడు పెద్దతిప్ప సముద్రంలో శ్రీ సత్యనారాయణ వ్రతం

నేడు పెద్దతిప్ప సముద్రంలో శ్రీ సత్యనారాయణ వ్రతం

అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రంలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రీ సత్యనారాయణ వ్రతం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు వేద పండితులచే ప్రత్యేక అలంకరణతో ఈ వ్రతం జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.