VIDEO: బోరంచలో పోటెత్తిన భక్తులు

VIDEO: బోరంచలో పోటెత్తిన భక్తులు

SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. గురువారం చైత్రమాసం పౌర్ణమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు రాలేకపోయారు. దాంతో ఇవాళ జిల్లాలోని నలుమూలల నుంచి, పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి పిండి, ఒడి బియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.