రెండో రోజు ఘనంగా హనుమాన్ యాగం

WGL: నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో గల శ్రీ హనుమాన్ ఆలయంలో జరుగుతున్న హనుమాన్ మహాయాగం బుధవారం రెండో రోజుకు చేరింది. బుధవారం వారాహి హోమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి ఒక్కరిపై ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.